పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రూత్‌లెస్ కాప్ పాత్రలో ప్రభాస్ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీయనున్నాడు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ సినిమా థియేటర్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక సీక్వెన్స్ కోసం హీరో ఓ సినిమా థియేటర్‌కు వెళ్తాడని.. అందుకే ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం విమల్ థియేటర్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ షూటింగ్‌లో పెద్ద ఎత్తున జనం కూడా ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా పక్కా మాస్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.


