నాగ చైతన్య కోసం ఓ వండర్ఫుల్ స్టోరీ

Published on Sep 22, 2020 3:00 am IST


అక్కినేని యువ హీరో నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం మిగిలి ఉన్న షూటింగ్ చేసిన టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. హీరోయిన్ సాయి పల్లవి తన పాత్రకు డబ్బింగ్ కూడ స్టార్ట్ చేశారు. ఈ చిత్రం తర్వాత చేయవలసిన సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నారు చైతన్య. ఆయన జాబితాలో నెక్స్ట్ విక్రమ్ కె కుమార్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వెంకీ అట్లూరి ఉన్నారు.

ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సైన్ చేసిన ‘థ్యాంక్యూ’ సినిమా అధికారికంగా ప్రకటితమైంది. తాజా సమాచారం మేరకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయవలసిన చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే హీరో, డైరెక్టర్ మధ్య చర్చలు ముగిశాయని, స్టోరీ లాక్ అయిందని తెలుస్తోంది. అయితే ఆ కథ ఏ క్రీడకు సంబంధించినది, ఎలా ఉండబోతోంది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంకీ అట్లూరి ప్రజెంట్ నితిన్ హీరోగా ‘రంగ్ దే’ చిత్రం చేస్తున్నారు. అది విడుదలైన తర్వాత, నాగ చైతన్య ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ముగిశాక వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More