నైజాంలో తగ్గుముఖం పట్టిన ‘స్పైడర్’ కలెక్షన్స్ !
Published on Oct 2, 2017 12:14 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రానికి విడుదలరోజు నుండే మొదలైన మిశ్రమ స్పందన వసూళ్ల మీద ప్రభావం చూపుతోంది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా రోజులు గడిచేకొద్దీ వసూళ్ళలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వసూళ్లను కీలకమైన నైజాం ఏరియాలో ఈ డ్రాప్ మరీ ఎక్కువగా ఉంది. మొదటి నాలుగురోజులు గాను ఈ చిత్రం నైజాంలో రూ.7. 8 కోట్ల షేర్ ను రాబట్టింది.

మిగిలిన చాలా ఏరియాల్లో పరిస్థితి ఇలానే ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్లో కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడైన ఈ చిత్రం శనివారం నాటికి 1.4 మిలియన్ల మాత్రమే వెనక్కి రాబట్టడంతో అక్కడ కూడా నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ ద్విభాషా చిత్రంతో మహేష్ తమిళంలో అఫీషియల్ గా లాంచ్ అయ్యారు.

 
Like us on Facebook