కొత్త రిలీజ్ డేట్ చూసుకున్న మహేష్ ‘స్పైడర్’ !

26th, April 2017 - 02:14:45 PM


సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ ల కానుకలో రూపొందుతున్న ‘స్పైడర్’ చిత్రాన్ని ముందుగా జూన్ 23న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ అనుకున్న ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాను కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో మహేష్ అభిమానుల్లో కొత్త విడుదల తేదీ పట్ల కాస్తంత సందిగ్ధం నెలకొంది. సినిమాను జూలైలో విడుదల చేస్తారని కొందరంటే ఇంకొందరు మాత్రం ఇంకా లేటవుతుందని అన్నారు.

కానీ తాజాగా తెలుస్తున్న వివరాలు ప్రకారం చిత్రాన్ని ఆగష్టు 9న రిలీజ్ చేస్తారట. అప్పటికైతే అన్ని పనులు పూర్తై ఆదియి వేడుక, ఇతర ప్రచార కార్యక్రమాలను టైమ్ దొరుకుతుందని ఈ తేదీని ఫిక్స్ చేశారట. అయితే దీనిపై కూడా ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది. హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.