‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!


మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా పట్ల ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో రోజు రోజుకు కుతూహలం పెరిగిపోతోంది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అవుతుండగా ఆడియో వేడుక, ప్రీ రిలీజ్ ఈవెంటుకు సంబందించిన వివరాలు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 17న హైదరాబాదలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని తెలుస్తోంది.

ఇక తమిళ లాంచింగ్ ఈవెంట్ చెన్నైలో ఈ నెల 9న అనగా రాబోయే శనివారంనాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా సినిమాను తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, అరబిక్ వంటి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో మహేష్ కెరీర్లో ఇదే అతి పెద్ద రిలీజ్ అనొచ్చు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, భరత్ లు ప్రతి నాయకులుగా నటించారు.