ఈ యంగ్ హీరో సినిమా కూడా కేవలం థియేటర్స్ లోనే.!

Published on May 28, 2021 3:00 pm IST

ఈ మధ్య కాలంలో పలు చిత్రాలుకు మంచి హైప్ ను ఆ సినిమాల తాలూకా పాటలే తీసుకొస్తున్నాయి. అలాంటి కొన్ని చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “ఎస్ ఆర్ కళ్యాణమండపం” కూడా ఒకటి. రాజా వారు రాణి గారు చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ యువ నటుడు టేకప్ ఈ చిత్రంతో మళ్ళీ మంచి హైప్ తెచ్చుకున్నాడు.

అయితే ఎప్పుడో పూర్తి కాబడిన ఈ చిత్రం గత నెలలో విడుదలకు రెడీ అయ్యింది.దీనితో ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ ఇన్ఫో బయటకి వచ్చింది. ఈ చిత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ చిత్రంలో మన తెలుగు గ్లామరస్ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ నటించగా శ్రీధర్ దర్శకత్వం వహించారు. అలాగే చైతన్ భరద్వాజ్ ఇచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం :