ఆహాలో స్ట్రీమ్ అవుతున్న “SR కళ్యాణ మండపం”..!

Published on Aug 28, 2021 2:00 am IST

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరో హీరోయిన్లుగా శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన “SR కళ్యాణ మండపం” ఆగస్ట్ 6వ తేదిన థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో తొలి క్లీన్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను గడించింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌గా “ఆహా ” లోకి వచ్చింది. ఈ సినిమాని ఇప్పటివరకు థియేటర్లలో చూడని వారు ఈ రోజు నుంచి ఆహా ద్వారా చూడవచ్చు. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ మరియు రాజులు నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :