నరేష్ వారసుడు హీరోగా వస్తున్నాడు..!

నరేష్ వారసుడు హీరోగా వస్తున్నాడు..!

Published on Jul 2, 2014 1:43 PM IST

naveen
ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. నవీన్ హీరోగా తెరకేక్కబోయే చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్, ప్రధాన తారాగణం తదితరుల ఎంపిక జరుగుతుంది. మరికొన్ని రోజులలో మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

123తెలుగు.కాం తరపున హీరోగా పరిచయం అవుతున్న నవీన్ కు అల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు