కొత్త సినిమాను అనౌన్స్ చేసిన శ్రీ విష్ణు !

నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఇటీవలే ‘నీది నాది ఒకే కథ’ వంటి సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్న శ్రీ విష్ణు భవిష్యత్ ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. హీరో ఇమేజ్ కన్నా మంచి నటుడనే గుర్తింపే ఎక్కువ సంతృప్తినిస్తుందని భావించే ఆయన కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమాను ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ‘అసుర’ చిత్ర దర్శకుడు కృష్ణ విజయ్ డైరెక్ట్ చేయనున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, ఓం శ్రీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా రేపే ఉదయం 11 గంటల 27 నిమిషాలకు లాంచ్ కానుంది. హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ఉండబోతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. ఇకపోతే సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పటి నుండి మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు అనేది తెలియాల్సిఉంది.