‘అల్లూరి’ టీజర్‌ తో ఆకట్టుకున్న శ్రీవిష్ణు!

Published on Jul 4, 2022 11:19 am IST

హీరో శ్రీవిష్ణు తన తదుపరి చిత్రం అల్లూరిలో పోలీసుగా నటిస్తున్నాడు, ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఒక పోలీసు కల్పిత బయోపిక్ ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. ఈ రోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. “ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్” అనే వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ చాలా బాగుంది. శ్రీవిష్ణు ఎస్‌ఐగా అదరగొట్టాడు. పోలీసు అధికారిగా శ్రీవిష్ణు తన డైనమిక్‌ అండ్ ఎనర్జిటిక్ ఫర్మామెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.

దర్శకుడు ప్రదీప్ వర్మ కూడా హీరో పాత్రకు తగ్గట్టు ఇచ్చిన పర్ఫెక్ట్ ఎలివేషన్స్ బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. టీజర్‌ని బట్టి చూస్తే అల్లూరి గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా అనిపిస్తోంది. కథానాయికగా నటించిన కయదు లోహర్ కూడా ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు టీజర్ కూడా సినిమా పై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా లక్కీ మీడియా వారు నిర్మాణం వహిస్తున్నారు

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :