‘మృత్యుంజయ్’గా వస్తున్న శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ లాక్..!

‘మృత్యుంజయ్’గా వస్తున్న శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ లాక్..!

Published on Feb 6, 2026 9:00 PM IST

Mrithyunjay

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మృత్యుంజయ’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తూ థియేటర్ల రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో రోడ్డు మధ్యలో న్యూస్ పేపర్లు గాలిలో ఎగురుతుండగా ఆయన సీరియస్‌గా నిలబడి ఉండటం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా, విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సందీప్ గుణ్ణం మరియు వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న శ్రీ విష్ణు, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లైట్‌బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి.

తాజా వార్తలు