ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?

ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?

Published on Mar 25, 2026 8:00 AM IST

Mrithyunjay-Movie-eng

శ్రీ విష్ణు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrithyunjay). హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో శ్రీ విష్ణు ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా ప్రయోగాత్మకంగా రూపొందింది.

​థియేటర్లలో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ సినిమా ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం పలు భాషల్లో విడుదలవుతుందని భావిస్తున్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ నుండి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

​లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతాన్ని అందించగా.. రచ్చ రవి, నెల్లూరు సుదర్శన్, సిజ్జు, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తాజా వార్తలు