శ్రీవిష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాల పై కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `తిప్పరామీసం`. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దర్శకుడు కృష్ణ విజయ్, హీరో శ్రీవిష్ణుని ఆవిష్కరించిన తీరు, లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
టీజర్ లో ‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే..“ అనే డైలాగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రానికి సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.