మహేష్ కు “దూకుడు” డైరెక్టర్ ఎమోషనల్ థాంక్స్.!

Published on Sep 23, 2020 10:06 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో “పోకిరి” సినిమా ఎలాంటి బెంచ్ మార్క్ ను సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దుమ్ము లేపడానికి మహేష్ కు చాలా కాలమే పట్టింది. పోకిరి తర్వాత తీసిన ప్రతీ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టినా హిట్ బాట పట్టలేదు.

కానీ ఆ కొన్నాళ్ల తర్వాత 2011లో సరిగ్గా ఇదే సెప్టెంబర్ 23న “దూకుడు” అనే సినిమా విడుదలయ్యింది. ఇక అంతే మరో సారి చరిత్రలో నిలిచిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఇలాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో అప్పటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు.

దూకుడు సెట్స్ లో ప్రతీ నిమిషమూ ఎంజయ్ చేసానని నా కెరీర్ లో ఒక మైలురాయి లాంటి క్రేజీ మరియు ఎమోషనల్ సినిమాను ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీను వైట్ల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఈ చిత్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ ను కూడా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More