‘సానుభూతి అవసరం లేదు’ మహర్షి పై శ్రీను వైట్ల స్పందన !

Published on May 9, 2019 10:17 pm IST

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ హిట్ టాక్ తో సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా
ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమాని చూసిన కొందరు సినీ ప్రముఖులు మహేశ్ బాబు నటన పై, అలాగే మహర్షి చిత్రబృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘మహర్షి’ చిత్రం చూశాను. ఒక సీఈవో‌గా, రైతుగా, స్టూడెంట్ గా మహేశ్ నటన చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్ పాత్రలో మహేశ్ బాబు లుక్, ఎనర్జీ చాలా కొత్తగా ఉంది. అదే విధంగా అల్లరి నరేశ్ నటన కూడా గుండెలకు హత్తుకునేలా ఉంది. దర్శకుడు వంశీ నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే శ్రీను వైట్ల రైతుల గురించి మాట్లాడుతూ.. రైతులకు మన సానుభూతి అవసరం లేదు. వాళ్లను గౌరవిస్తే వాళ్లు మనల్ని సొంతవాళ్లుగా చూస్తారు’ అని శ్రీను వైట్ల పోస్ట్ చేసారు.

కాగా మహేశ్ – శ్రీను వైట్ల.. కాంబినేషన్ లో గతంలో దూకుడు, ఆగడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మహర్షి విషయానికి వస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More