అఖిల్ తో శ్రీనువైట్ల సినిమా.. నిజమేనా ?

అఖిల్ తో శ్రీనువైట్ల సినిమా.. నిజమేనా ?

Published on Jun 27, 2021 10:05 PM IST

అక్కినేని అఖిల్ – పూజా హెగ్డే కలయికలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తుంది. అఖిల్ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడని.. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. కాకపోతే వచ్చే ఏడాది తరువాత ఈ సినిమా ఉంటుందట.

ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు