సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో శృతి హాసన్ ఓ ఐటెం సాంగ్ చేయనున్న సంగతి మరియు ఈ పాటని ఈ రోజు నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారని తెలియజేశాం. అలాగే ఈ పాటని శృతి హాసన్ ఆలపించడంతో మరింత క్రేజ్ పెరిగింది.
శృతి హాసన్ షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టిన మొదటి రోజే డైరెక్టర్ శ్రీను వైట్ల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. ‘స్పెషల్ అండ్ మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తో ఈ రోజు స్పెషల్ సాంగ్ మొదలు పెట్టాం. ఈమె గ్రేట్ డాన్సర్ మాత్రమే కాకుండా సూపర్బ్ సింగర్ కూడా. ఈ స్పెషల్ సాంగ్ ని పాడినందుకు శృతికి నా స్పెషల్ థాంక్స్ అని’ శ్రీను వైట్ల ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.


