ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘విష్ణు విన్యాసం’..శ్రీవిష్ణు ఫన్ ఎంటర్టైనర్ చూసారా?

vishnu vinyasam

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకుడు ఎదునాధ్ వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం విష్ణు విన్యాసం కూడా ఒకటి. గత నెలలో విడుదల అయ్యిన ఈ సినిమా మంచి ఫన్ ని అందించి డీసెంట్ వసూళ్లు కూడా రాబట్టింది. ఇలా ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి వచ్చేసింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఈ సినిమా కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం. సో అప్పుడు ఎవరైనా ఈ ఫన్ ఎంటర్టైనర్ ని మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఓటీటీలో చూసి ఆనందించండి. ఇక ఈ సినిమాకి రధన్ సంగీతం అందించగా సుమంత్ నాయుడు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version