
‘కొత్తబంగారు లోకం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా మెప్పించిన శ్రీ కాంత్ అడ్డాల ఆ తర్వాత మహేష్ బాబు – వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను సమానంగా మానేజ్ చేస్తూ చేసిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా కూడా హిట్ అయ్యి అతనికి పక్కా ఫ్యామిలీ డైరెక్టర్ అని ముద్ర వేసేసింది.
కానీ శ్రీ కాంత్ అడ్డాల మాత్రం ఆ ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఇమేజ్ ని వద్దనుకుంటున్నాడు. తనకున్న ఫ్యామిలీ ఫిల్మ్ డైరెక్టర్ అనే ఇమేజ్ ని పోగొట్టుకోవడానికి యాక్షన్ అండ్ రొమాన్స్ సినిమా చేస్తున్నారు. అదే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమా ‘గొల్లభామ’. ఈ సినిమాతో తనకు ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఇమేజ్ పోతుందని శ్రీ కాంత అడ్డాల భావిస్తున్నాడు.
నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

