‘కల్కి’ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్

Published on Jun 17, 2019 6:19 pm IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకులకు నమస్కారం. ‘కల్కి’ రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను.ఈ సినిమా ట్రైలర్,ప్రోమో సాంగ్స్ కి వస్తున్న స్పందన చూసి,కంటెంట్ పై నమ్మకంతో ఈ మూవీ ని హక్కులను కొనడం జరిగింది అన్నారు. రాజశేఖర్ గత చిత్రం గరుడ వేగ, దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన “అ” చిత్రాలు మంచి విజయం సాదించాయి.ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. రాజశేఖర్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇందులో కూడా స్కార్లెట్ చేసిన ఓ ఐటెం సాంగ్ ఉంది. హీరోయిన్స్ ఆదా శర్మ,నందిత శ్వేతా చక్కగా చేశారు. ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు కస్టపడి పనిచేసారు. మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.

సంబంధిత సమాచారం :

More