శ్రీవిష్ణు సూపర్ ఫామ్లో ఉన్నాడు

శ్రీవిష్ణు సూపర్ ఫామ్లో ఉన్నాడు

Published on Dec 29, 2020 2:27 AM IST

‘బ్రోచేవారెవరురా’, ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి వరుస విజయాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి కొత్త దర్శకులు, నిర్మాతలు చాలా ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వాటిలో నచ్చిన కథలకు వెంటనే సైన్ చేసేస్తున్నారు. ప్రజెంట్ ఆయన చేస్తున్న ‘రాజ రాజ చోళ’ముగింపు దశలో ఉండగా ‘గాలి సంపత్’ అనే కొత్త చిత్రం ఇటీవలే మొదలై సగం పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది.

ఈ రెండూ కాకుండా ఇటీవలే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఒక సినిమాకు సైన్ చేశాడు ఈ హీరో. ఇది కాకుండా తాజగా మరో కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలుకానుంది. దీంతో మొత్తం ఆయన చేతిలో నాలుగు చిత్రాలున్నాయి ఇప్పుడు. ఇవి కాకుండా వచ్చే ఏడాది ఆయన ఇంకొన్ని కొత్త సినిమాలకు సైన్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు