కంబ్యాక్ మూవీకి భారీ ప్యాకేజ్ తీసుకున్న శ్రీదేవి

కంబ్యాక్ మూవీకి భారీ ప్యాకేజ్ తీసుకున్న శ్రీదేవి

Published on Dec 15, 2014 8:00 AM IST

sridevi
అటు సౌత్ ఇటు నార్త్ లో ఎవర్గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందిన బ్యూటిఫుల్ లేడీ శ్రీదేవి. ప్రస్తుతం శ్రీదేవికి ఐదు పదుల వయసు అయినప్పటికీ ప్రస్తుత హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రీతిలో గ్లామరస్ గా ఉంటుంది. శ్రీదేవి 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీదేవి వరుసగా సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ ఆమె ఆచితూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటోంది.

ఇటీవలే శ్రీదేవి ఇలయతదలథి విజయ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీదేవి ఈ సినిమా కోసం భారీ అమౌట్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నటించడానికి ఈ చిత్ర నిర్మాతలు శ్రీదేవికి 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. దీనిప్రకారం శ్రీదేవి సౌత్ ఇండియన్ కంబ్యాక్ మూవీకి భారీ అమౌంట్ ని తీసుకుంది. దీని ప్రకారం ఇంత భారీ రెమ్యునరేషన్ పెట్టి శ్రీదేవిని తెలుగు సినిమాకి తీసుకుంటారా.? అనేది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు