“శ్రీదేవి సోడా సెంటర్” దర్శకుని ఎమోషనల్ లెటర్.!

Published on Aug 26, 2021 1:38 pm IST


రేపటి శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రాల్లో మచ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా “జాంబీ రెడ్డి” ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటించిన ఇంటెన్స్ ఎమోషన్స్ చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్” కూడా ఒకటి. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి బజ్ కూడా నెలకొంది. ఆసక్తికర ప్రమోషన్స్ తో విడుదలకి సిద్ధం అవుతున్న ఈ చిత్ర దర్శకుని నుంచి ఒక భావోద్వేగ పూరిత లేఖ బయటకి వచ్చింది.

రేపు తన సినిమా విడుదల పట్ల తాను ఒక దర్శకునిగా సినిమా ప్రేక్షకునిగా ఎలా ఫీల్ అవుతున్నారో తెలిపారు. తన చిన్ననాట జ్ఞ్యాపకాలను నెమరు వేసుకుంటూ మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబర్ 786 ని ఎలా అయితే నేల టికెట్ లో కూర్చొని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో చూసానో ఇప్పుడు ఈ సినిమాని కూడా అలాగే చూస్తానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాని నేల టిక్కెటులో కూర్చొని చూస్తే ఆ కిక్కే వేరు అని తెలిపారు. మరి రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :