సుదీప్ సినిమాలో శ్రీదేవి

Sridevi_sudeep

ఒకప్పటి సినీ అభిమానుల కలల రాణి, ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి చాలా కాలం తర్వాత నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుసబెట్టి ఆఫర్స్ వస్తున్నా శ్రీ దేవి మాత్రం వాటిని హోల్డ్ లో పెట్టింది. తాజా సమాచారం ప్రకారం శ్రీ దేవి కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన ఓ తమిళ సినిమాలో నటించనుంది.

బాలీవుడ్ లో ఎన్నో ఆఫర్లు తనకు ఉన్నా శ్రీదేవి మాత్రం తమిళ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు తమిళ హీరోలు కూడా నటించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Exit mobile version