శ్రీదేవి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు !

శ్రీదేవి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు !

Published on Feb 27, 2018 5:39 PM IST

కొద్దిసేపటి వరకు ఉత్కంఠ రేపుతూ వచ్చిన స్టార్ నటి శ్రీదేవి మృతి కేసు ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. స్థానిక కేసుల్లానే ఈ కేసును కూడ టేకప్ చేసిన అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు పూర్తిస్థాయి విచారణ జరిపి శ్రీదేవి స్పృహతప్పి బాత్‌టబ్‌లోని నీళ్లలో పడి ఊపిరాడక మరణించారని నిర్థారించి కేసును కొట్టివేసింది.

అనంతరం ఆమె మృతదేహాన్ని ఎంబామింగ్ (సుగంధద్రవ్యాలతో భద్రపరిచే విధానం) నిమిత్తం భారత కాన్సులేట్, కుటుంబ సంభ్యులకు అప్పగించింది. ఇప్పుడు ఈ ప్రక్రియ కూడ పూర్తికావడంతో శ్రీదేవి పార్థివదేహం పూర్తిగా కుటుంబ సభ్యుల చేతుల్లోకి వచ్చింది. దీంతో బోనీ కపూర్ తదితరులు అనిల్ అంబానీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం నిలిపి ఉన్న విమానాశ్రయానికి అంబులెన్స్ ద్వారా శ్రీదేవిని తీసుకొస్తున్నారు. ఈరోజు రాత్రి కల్లా వీరు ముంబై చేరుకోనున్నారు.

తాజా వార్తలు