రోమానియా లో రిలీజ్ అవుతున్న శ్రీదేవి మూవీ

రోమానియా లో రిలీజ్ అవుతున్న శ్రీదేవి మూవీ

Published on Oct 26, 2014 3:39 PM IST

English-Vinglish
ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఈ సినిమా 2012 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఎంత గ్యాప్ తీసుకున్నా శ్రీ దేవి నటనకి, అందానికి వన్నె తగ్గలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఇప్పటికే జపనీస్ లో రిలీజ్ అయ్యిపెద్ద హిట్ అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని రోమానియాలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందరభంగా త్వరలోనే శ్రీ దేవి రోమానియాలో సందడి చేయనుంది. త్వలోనే ఈ మూవీ రోమానియా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్, ఆదిల్ హుస్సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కథాంశం అమెరికా వెళ్ళిన ఒక ఇండియన్ హౌస్ వైఫ్ చుట్టూ తిరుగుతుంది.

తాజా వార్తలు