‘కేరింత’లో మారుతి హీరోయిన్..?

‘కేరింత’లో మారుతి హీరోయిన్..?

Published on Jan 10, 2015 8:10 AM IST

sridivya
సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘కేరింత’ సినిమాలో హీరోయిన్ గా మారుతి ‘బస్ స్టాప్’ ఫేం, తెలుగమ్మాయి శ్రీదివ్యను ఎంపిక చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ను మార్చడం ఇది మూడవసారి. గతంలో ఇదే పాత్రకు మొదట లావణ్య త్రిపాఠిని, తర్వాత ‘దృశ్యం’ ఫేం కృతిక జయకుమార్ లను తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత వీరి నటనతో సంతృప్తి చెందక తొలగించారని వార్తలు వచ్చాయి. వీటిలో నిజం ఎంత ఉందొ తెలియదు. ప్రస్తుతం శ్రీదివ్య తమిళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, అక్కడ మంచి విజయాలు సొంతం చేసుకుంది. ‘కేరింత’లో నటించడానికి పారితోషకం బాగానే తీసుకుందట.

సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా ‘ఐస్ క్రీమ్’ గర్ల్ తేజస్వి నటిస్తుంది. యూత్‌ ఫుల్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. కాలేజీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని సమాచారం.

తాజా వార్తలు