ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఇంకా సినిమా సెట్ కాలేదు !

Published on Jun 2, 2019 10:00 pm IST

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని హీరోగా నటించబోతున్నాడని.. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ కూడా నానికి వినిపించాడని.. నానికి కథ బాగా నచ్చిందని.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. కాగా ఈ న్యూస్ గురించి నాని తన ట్విట్టర్ వేదికగా స్పదించారు. నాని ట్వీట్ చేస్తూ.. ‘ఇది నిజం కాదు మై బాయ్స్‌’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ లో అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఇక ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించట్లేదు. ఒక సినిమా పరాజయం పాలైతే చాలు, ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఇక తొందరగా అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు, మంచి చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. తన సినిమా విడుదలయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతునప్పటికీ.. శ్రీకాంత్ మాత్రం ఇంకా సినిమాను మొదలుపెట్టలేదు.

సంబంధిత సమాచారం :

More