‘ముకుంద’తో సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.

‘ముకుంద’తో సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.

Published on Dec 18, 2014 1:58 AM IST

Srikanth_Addala
‘ముకుంద’ సినిమాతో మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలకు పేర్లు పెట్టలేదు. సినిమా ఆసాంతం మిగతా పాత్రధారులు వీరిద్దరిని పెద్దోడా, చిన్నోడా అని పిలుస్తుంటారు.

తాజాగా ‘ముకుంద’ సినిమాలో కూడా హీరో వరుణ్ తేజ్ కు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పేరు పెట్టలేదు. అలాగే పూజ హెడ్గేకు కూడా. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లను చుట్టుపక్కల వాళ్ళు ఏమని పిలుస్తారో..? వెయిట్ & సి.

ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిచిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలవుతుంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలు హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తాజా వార్తలు