శ్రీకాంత్ నూతన చిత్రం ప్రారంభం !

శ్రీకాంత్ నూతన చిత్రం ప్రారంభం !

Published on Jul 9, 2018 5:00 PM IST

sreekanth3

సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కోతలరాయుడు’ ఈ రోజు పూజా కార్యాక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. నూతన దర్శకుడు సుధీర్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో డింపుల్ చోపడే , నటాషా దోషి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటరమణ మూవీస్ పతాకం ఫై కోలన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

గత కొంత కాలంగా సోలో హీరో గా సినిమాలు తగ్గించేసిన శ్రీకాంత్ మళ్ళి ఈ చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఇక ఆయన నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన 2 ‘చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది .

తాజా వార్తలు