సోషల్ మీడియాలో ‘శ్రీమంతుడు’ ప్రచార జోరు!

సోషల్ మీడియాలో ‘శ్రీమంతుడు’ ప్రచార జోరు!

Published on Jul 28, 2015 4:24 PM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా మరో పది రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులే కాక, సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండడంతో సినిమా యూనిట్ ఓపక్క మిగిలి ఉన్న పొస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంతో పాటు మరోపక్క ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఇక ఇప్పటికే విడుదలైన ఆడియో అంతటా మారుమోగిపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆడియో రిలీజ్ రోజునుండే సోషల్ మీడియాలో శ్రీమంతుడు టీమ్ మొదలుపెట్టిన ప్రచార కార్యక్రమాలు ఈ వారం నుంచి మరింత వేగం పుంజుకున్నాయి. రోజుకో పోస్టర్, సాంగ్ మేకింగ్, వర్కింగ్ స్టిల్స్, మూవీ స్టిల్స్ ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఆగష్టు ఒకటి నుండి సాంప్రదాయ మీడియా, పత్రికా ఇంటర్వ్యూలతో ‘శ్రీమంతుడు’ టీమ్ బిజీ కానుంది. తమిళంలోనూ ఆగష్టు 7నే విడుదల కానున్న ఈ సినిమాకు అక్కడ సెల్వందన్ అనే పేరును ఖరారు చేశారు. జూలై 31న చెన్నైలో సెల్వందన్ ఆడియో రిలీజ్ జరగనుంది.

తాజా వార్తలు