ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే అభిమానులంతా మొదటి రోజు మొదటి బెనిఫిట్ షో చూడాలని ఆరాటపడుతుంటారు. టాలీవుడ్ లో అలాంటి సంఘటన చోటు చేసుకోవడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇప్పటికే శ్రీమంతుడు థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. అలాగే మహేష్ బాబు సినిమా బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం కూడా అభిమానులు ఎగబడుతున్నారు. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వలన అరీమంతుడు టికెట్స్ ధర కూడా భారీగానే పలుకుతోంది. ఇరు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లోనే బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఒక్క బెనిఫిట్ షోస్ నుంచే 80 లక్షల నుంచి కోటి రూపాయలకి పైనే వసూలు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. బాహుబలి తర్వాత ఈ రేంజ్ బెనిఫిట్ షోస్ ‘శ్రీమంతుడు’కే ప్లాన్ చెయ్యడం విశేషం. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సొంతం చేసుకున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. లోకల్ తో పాటు యుఎస్ లో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడమే కాకుండా 160 లొకేషన్స్ లో శ్రీమంతుడు ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, సనమ్ శెట్టి, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


