ఓ మంచి సోషల్ మెసేజ్‌తో ‘శ్రీమంతుడు’..!

ఓ మంచి సోషల్ మెసేజ్‌తో ‘శ్రీమంతుడు’..!

Published on Jun 7, 2015 11:53 AM IST

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ డైలాగ్స్, కొరటాల శివ మార్క్ సన్నివేశాలు టీజర్‌లో స్పష్టంగా కనిపించడంతో మహేష్ మళ్ళీ తన మ్యాజిక్ సినిమాతో రానున్నాడనే టాక్ వినబడుతోంది.

ఇక శ్రీమంతుడు గురించి మరిన్ని ఆసక్తికర అంశాలను సినిమాటోగ్రాఫర్ మధి ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, సినిమాలో ఓ బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మహేష్ ఈ సినిమాలో ఓ కోటీశ్వరుడుగా కనిపించనున్న విషయం తెలిసిందే! ఓ ఊరిని దత్తత తీసుకోవడం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ ద్వారా స్పష్టమైంది. మరి సినిమాలో ఉండే ఆ బలమైన సోషల్ మెసేజ్ ఏమిటన్నది తెలియాలంటే జూలై 17వరకూ ఆగాల్సిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనెల 27న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు