ఓవర్సీస్ రికార్డ్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసిన ‘శ్రీమంతుడు’

ఓవర్సీస్ రికార్డ్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసిన ‘శ్రీమంతుడు’

Published on Aug 10, 2015 4:30 PM IST

Srimanthudu
ఓ సూపర్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల దాహాన్ని తీర్చిన సినిమా ‘శ్రీమంతుడు’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో సుమారు 40 కోట్ల మార్క్ ని టచ్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారిక పూర్తి కలెక్షన్స్ లిస్టు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకి స్ట్రాంగ్ బిజినెస్ బేస్ ఉన్న ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తోంది.

యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ తెలిపిన సమాచారం ప్రకారం ఫస్ట్ వీకెండ్ లో శ్రీమంతుడు సినిమా $2మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసింది. మహేష్ బాబు కెరీర్లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన మొదటి సినిమా ఇదే కావడం మొదటి రికార్డ్ అయితే, మహేష్ కెరీర్లో యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన 5వ సినిమా ఇది. అంతే కాకుండా ఇప్పటి వరకూ యుఎస్ బాక్స్ ఆఫీసు వద్ద మొదటి రెండు ప్లేస్ లలో బాహుబలి, అత్తారింటికి దారేది సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీమంతుడు సినిమా అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని క్రాస్ చేసి యుఎస్ బాక్స్ ఆఫీసు వద్ద టాప్ సెకండ్ ప్లేస్ ని కైవసం చేసుకుంది. అలాగే శ్రీమంతుడు లాంగ్ రన్ లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు