‘శ్రీమంతుడు’ తమిళ ఆడియో రిలీజ్ వాయిదా!

‘శ్రీమంతుడు’ తమిళ ఆడియో రిలీజ్ వాయిదా!

Published on Jul 29, 2015 7:23 PM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న విడుదల కాబోతోంది. గతంలో మహేష్ సినిమాలు కొన్ని తమిళంలో డబ్ అయినా అవేవీ నేరుగా తెలుగు సినిమా రిలీజ్ రోజే విడుదల కాలేదు. అయితే ‘శ్రీమంతుడు’ మాత్రం భారీ ఎత్తున తమిళంలోనూ ఆగష్టు 7నే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇక ఈ క్రమంలోనే జూలై 31న తమిళ వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను కూడా వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. కాగా తాజాగా ఆడియో రిలీజ్‌ను ఆగష్టు 4వ తేదీకి మార్చేశారు. ఇందుకు సంబంధించిన కారణాలేవీ ప్రస్తుతానికి తెలియదు. ఇక మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొననున్న ఈ వేడుకకు పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించింది.

తాజా వార్తలు