
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా చిత్రీకరణ చివరిదశలో వుంది. జూన్ 17 న గానీ 18న గానీ షూటింగ్ పుర్తిచేసుకోనుంది. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులలో బిజీగా వుంది.
ఇటీవల విడుదలచేసిన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ నెలలో ఆడియోని విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. జులై 17న చిత్రాన్ని విడుదలచేయనున్నారు.

