ప్రెస్‌ నోట్ : ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ రిపోర్ట్!

ప్రెస్‌ నోట్ : ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ రిపోర్ట్!

Published on Aug 8, 2015 4:13 PM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్రీమంతుడు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. ఇక అంతా అనుకున్నట్లుగానే మొదటిరోజు ఈ సినిమా అన్ని చోట్లా కలెక్షన్లు కుమ్మేసింది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాలను కలుపుకొని చూస్తే మొదటిరోజు ‘శ్రీమంతుడు’ సినిమా ప్రప్రంచవ్యాప్తంగా సుమారు 30.14 కోట్ల షేర్ సాధించింది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. దీంతో మొదటిరోజు కలెక్షన్ల స్థాయిలోనే వీకెండ్ కలెక్షన్స్ కూడా ఉంటాయని ట్రేడ్ టాక్!

ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా
కలెక్షన్స్ (షేర్)
నైజాం 5.60 కోట్లు
సీడెడ్ 2.90 కోట్లు
కృష్ణా 1.20 కోట్లు
గుంటూరు 2.05 కోట్లు
నెల్లూరు 0.60 కోట్లు
తూర్పు గోదావరి 1.71 కోట్లు
పశ్చిమ గోదావరి 1.90 కోట్లు
వైజాగ్ 1.05 కోట్లు
కర్ణాటక 2.02 కోట్లు
తమిళనాడు  0.56 కోట్లు
నార్త్ ఇండియా 0.92 కోట్లు
అమెరికా 8.55 కోట్లు
ఓవర్సీస్ (అమెరికా కాకుండా) 1.08 కోట్లు
మొత్తం 30.14 కోట్లు 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు