కలెక్షన్స్ రిపోర్ట్ : నైజాంలో ‘శ్రీమంతుడు’దే హవా

కలెక్షన్స్ రిపోర్ట్ : నైజాంలో ‘శ్రీమంతుడు’దే హవా

Published on Aug 11, 2015 10:36 AM IST

srimnathudu
టాలీవుడ్ లో సరికొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలను ప్రారంభించిన మహేష్ బాబు సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని కమర్షియల్ గా చెప్పడంలోనూ సక్సెస్ అయ్యాడు. దానికి ఉదాహరనే ‘శ్రీమంతుడు’ సినిమా. మనం పుట్టిన ఊరుని మరిచిపోకూడదు, అవసరం అయతే ఆ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చెయ్యాలి అనే పాయింట్ ని ప్రేక్షకులకు అమితంగా నచ్చేలా చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది.

విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తున్న శ్రీమంతుడు సినిమా నిజాంలోనూ సరికొత్త రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. మాకు అందిన పర్ఫెక్ట్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో శ్రీమంతుడు సినిమా 12 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లో సుమారు 10 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన శ్రీమంతుడు వీక్ డే అయిన సోమవారం కూడా 2 కోట్లకి పైనే షెడ్ సాధించి 12 కోట్ల షేర్ మార్క్ ని టచ్ అయ్యింది. మొదటి వారం లోపు సుమారు 15 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు