క్లాస్ తో పాటు మాస్ ని మెప్పించే ‘శ్రీమంతుడు’

క్లాస్ తో పాటు మాస్ ని మెప్పించే ‘శ్రీమంతుడు’

Published on Jul 26, 2015 9:16 PM IST

Srimanthudu-Audio-Release

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తెలుగు సినీ ప్రేమికులు ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారలే ఉండడం వలన ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ట్రైలర్ మరియు సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే కొరటాల శివ మహేష్ బాబుని ప్రెజంట్ చేసిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. కానీ కొంతమందిలో ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ హై ఎమోషన్స్ అని భావిస్తున్నారు.

కానీ అలాంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టి, ప్రేక్షకుల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి ఈ విషయంపై ఈ చిత్ర టీం స్పందించింది. ‘శ్రీమంతుడు సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎమోషన్స్ ఉంటాయి. అలా అని ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా కాదు. మహేష్ బాబు నుంచి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయి. క్లాస్ కి నచ్చే సూపర్ కూల్ లవ్ ట్రాక్, క్లాస్ టేకింగ్ ఉంటుంది. ఓవరాల్ గా శ్రీమంతుడు క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించే సినిమా’ అని ఈ చిత్ర టీం తెలిపింది.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, అంగన రాయ్, సనమ్ శెట్టి, పూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు