
‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ చేత ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ అనే డైలాగ్ చెప్పించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కొరటాల శివ ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు చేత ‘మా ఊరి నుంచి చాలా తీసుకున్నాను.. తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే లావైపోతాను’ అనే డైలాగ్ ని చెప్పించారు. మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పిన సినిమా ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగున్నాయి. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ వలన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతోంది.
ఒక్క బిజినెస్ పరంగానే కాదు శాటిలైట్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుత లీడింగ్ టీవీ ఛానల్స్ మధ్య జరిగ్గిన పోటీలో ఓ నేషనల్ వైడ్ టీవీ ఛానల్ సుమారు 17 కోట్లకి ‘శ్రీమంతుడు’ శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. అందులో తెలుగు పరంగా శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్ 12 కోట్లు పలికితే, హిందీ వెర్షన్ ని 5 కోట్లకి కొనుగోలు చేసారు. ఇలా రెండు భాషలకు సంబందించిన శాటిలైట్ రైట్స్ భారీ ప్రైజ్ కి అమ్ముడవడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చాలా హ్యాపీగా ఉన్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆగష్టు 7నే ఈ సినిమా ‘సెల్వందన్’ పేరుతో తమిళంలో కూడా రిలీజ్ కానుంది.

