మహేష్ ‘శ్రీమంతుడు’ వాయిదా పడనుందా?

మహేష్ ‘శ్రీమంతుడు’ వాయిదా పడనుందా?

Published on Jun 9, 2015 2:02 AM IST

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ డైలాగ్స్, కొరటాల శివ మార్క్ సన్నివేశాలు టీజర్‌లో స్పష్టంగా కనిపించడంతో మహేష్ మళ్ళీ తన మ్యాజిక్ సినిమాతో రానున్నాడనే టాక్ వినబడుతోంది.

ఇక ముందునుంచీ చెబుతూ వస్తున్నట్టుగా ‘శ్రీమంతుడు’ సినిమా జూలై 17న విడుదలయ్యే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఈ మధ్యే మొదలయ్యాయ్! ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు సినిమా బాగా రావడానికి అన్ని రకాలుగా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తుందన్నందువల్ల చెప్పిన సమయానికి సినిమా విడుదలయ్యే అవకాశం తక్కువని తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు