సావిత్రిగారి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగారి సినీ జీవితంలో ముఖ్యులైన ప్రతి ఒక్కరిని సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ను ప్రవేశపట్టిన ఆయన సావిత్రిగారి సినీ కెరీర్ ను కొత్త పుంతలు తొక్కేలా చేసిన మేటి దర్శకులు కెవి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ వంటి వారి పాత్రల్ని కూడా సినిమాలో చూపించనున్నారు.
వీరిలో కె.వి.రెడ్డి పాత్ర కోసం దర్శకుడు కృష్ణ జాగర్లమూడిని ఎంచుకున్న నాగ్ ఎల్.వి.ప్రసాద్ పాత్ర కోసం నటుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాలను తీసుకున్నారు. అంతేగాక ‘మహానటి’ కథలో ముఖ్యమైన ఇతర పాత్రల కోసం కూడ పాపులర్ వ్యక్తుల్నే ఎంచుకున్నారట. వారి వివరాలు కూడ త్వరలోనే తెలియనున్నాయి. ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.


