‘అష్టాచెమ్మా’, ‘ఆరెంజ్’, ‘సరదాగా కాసేపు’ సినిమాలలో మంచి హాస్యభరిత పాత్రలలో అలరించిన శ్రీనివాస్ అవసరాల సడెన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో డైరెక్టర్ గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ సినిమాలో మంచి నటన మాత్రమేకాక తనలో దాగున్న దర్శకత్వ ప్రతిభతో అందరినీ అబ్బురపరిచాడు.
తాజాగా శ్రీనివాస్ ఒక షో కి క్విజ్ మాస్టర్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ ఆఫర్ ను ఎప్పట్నుంచో టి.వి బృందం అడుగుతున్నారని, అయితే ముందు దానిని నేను అంగీకరించలేదని చివరికి పిల్లలతో కాసేపు సరదా కాలక్షేపం నేపధ్యంలో ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఏకధాటిగా మూడు రోజుల్లో 18 ఎపిసోడ్ లు చిత్రీకరించినట్టు తెలిపాడు. ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది


