‘బాహుబలి’చిత్రానికి పనిచేసిన టెక్నిషియనే ‘2. 0’కూడా !

Published on Jul 12, 2018 4:05 am IST


తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆ స్థాయిలో విజయం సాధించడానికి విఎఫ్ఎక్స్ కూడా ఒక కారణం. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అందించిన ప్రముఖ గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్ ఇప్పు డు ‘రోబో’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న’2.0’చిత్రానికి కూడా ఆయనే విఎఫ్ఎక్స్ అందిస్తున్నాడు .

బాహుబలి లాంటి విజువల్ వండర్ ను ప్రేక్షకులకు అందించిన ఆయన ఈచిత్రానికి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More