శ్రీనివాస కళ్యాణం 3 రోజుల నైజాం షేర్ !

శ్రీనివాస కళ్యాణం 3 రోజుల నైజాం షేర్ !

Published on Aug 12, 2018 6:26 PM IST

‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో యువ హీరో నితిన్ నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఆగస్టు 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి మౌత్ టాక్ ని తెచ్చుకొని విజయం దిశగా పయనిస్తుంది. కుటుంభ కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం 3రోజులకు గాను నైజాంలో 2.86కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఈచిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది. అయితే వచ్చే వారం నుండి బాక్సాఫిస్ వద్ద ఎలాంటి రన్ ను కొనసాగిస్తో చూడాలి.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈచిత్రంలో నితిన్ సరసన రాశి ఖన్నా నటించారు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫెమ్ నందిత శ్వేతా ముఖ్య పాత్రలో నటించిన ఈచిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు