రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస కళ్యాణం’ !

28th, March 2018 - 12:20:50 PM

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ ఏప్రిల్ 5న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ చండీఘర్ లో మొదలుకానుంది.

ఈ చిత్రాన్ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రాశీ ఖన్నా కథానాయకిగా నటిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.