‘జార్జ్ క్రిష్’లో ‘శ్రీనివాస మంగాపురం’ బ్యూటీ ?

‘జార్జ్ క్రిష్’లో ‘శ్రీనివాస మంగాపురం’ బ్యూటీ ?

Published on Jul 26, 2026 10:01 AM IST

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌ గా భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. హీరోయిన్ రషా థడానీను ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే.. ‘శ్రీనివాస మంగాపురం’ తర్వాత రషా థడానీకు మరో మంచి సినిమాలో అవకాశం దొరికినట్టే.

ఇక ఈ సినిమా ఘాట్ ఆగస్టు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట.

తాజా వార్తలు