విజయ్ సినిమాలో షారుక్.. నిజం ఏమిటంటే

విజయ్ సినిమాలో షారుక్.. నిజం ఏమిటంటే

Published on Jul 4, 2019 1:05 AM IST

అట్లీ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ చేస్తున్న ‘బిజిల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇంకొద్దిరోజుల్లో అది కూడా పూర్తికానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఒక పాటలో కనిపిస్తారని, విజయ్, ఆయన కలిసి స్టెప్పులేస్తారని వార్తలొచ్చాయి. తీరా వీటిపై ఆరాతీస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలింది.

షారుక్ సైతం సినిమాలు నుండి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో అట్లీ కుమార్, విజయ్ కాంబినేషన్లో ‘మెర్సల్, తేరీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు