బాహుబలి2 కి చేరువలో పఠాన్

Published on Feb 27, 2023 7:57 pm IST


కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డు లను బ్రేక్ చేసి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి బాహుబలి 2 కి చేరువైంది.

షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం ఆదివారం మరో 2.45 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 507.6 కోట్ల రూపాయల రాబట్టింది. 510 కోట్ల తో బాహుబలి2 టాప్ లో ఉండగా, ఇప్పుడు పఠాన్ చిత్రం బాహుబలి2 టార్గెట్ ను చేసుకుంది. ఇప్పటికే బాహుబలి2 కి చేరువైన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ఈ రికార్డ్ ను చెరిపేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవనుంది. ఈ చిత్రం లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా నటించారు.

సంబంధిత సమాచారం :