ఆనందంలో తేలిపోతున్న శృతి, కారణం ఏంటంటే?

ఆనందంలో తేలిపోతున్న శృతి, కారణం ఏంటంటే?

Published on Jun 10, 2020 1:01 AM IST

shruthi hassan

హీరోయిన్ శృతి హాసన్ ఆనందంతో పొంగిపోతుంది. ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్స్ కి చేరడమే దీనికి కారణం. దీనితో ఓ హ్యాపీ వీడియో శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది అత్యంత సంతోషకర సమయం అని చెప్పారు. ఇక 14మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. అక్షరాల కోటి నలభై లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నట్లన్నమాట.

ఇక తెలుగులో శృతి హాసన్ హీరో రవితేజకి జంటగా క్రాక్ మూవీలో నటిస్తుంది. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో రవితేజ పోలీస్ పాత్ర చేస్తుండగా శృతి ఆయన భార్య రోల్ లో కనిపించనున్నారు. గతంలో శృతి హాసన్, రవితేజ తో ఇదే దర్శకుడితో చేసిన బలుపు మూవీ మంచి విజయం సాధించింది. క్రాక్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

https://www.instagram.com/p/CBNYKhGBovg/

తాజా వార్తలు